అలెగ్జాండర్ హీవెన్స్, స్టాసీ బూత్ ఆరేళ్ల పాటు కలిసి జీవించారు. మొదట బాగానే ఉన్నప్పటికీ.. హీవెన్స్‌కు డ్రగ్స్ అలవాటు కావడంతో అతని ప్రవర్తనలో మార్పు వచ్చి గర్ల్‌ఫ్రెండ్‌కు నిత్యం నరకం చూపిస్తూ వచ్చాడు. బాయ్‌ఫ్రెండ్ చూపిస్తున్న నరకానికి తన దగ్గర ఉండలేనని స్టాసీ అతనికి గుడ్‌బై చెప్పేసింది. అంతేకాకుండా అతను చూపించిన నరకానికి కోర్టుకెక్కింది. కోర్టులో ఆమె చెప్పిన మాటలకు జడ్జిలు సైతం ఆశ్చర్యపోయారు. 2016 వరకు తనతో బాగానే ఉండేవాడని, ఆ తర్వాత నెమ్మదిగా అలెగ్జాండర్‌లో మార్పు వచ్చిందని స్టాసీ చెప్పింది. డ్రగ్స్, కొత్త స్నేహితులు పరిచయం అవడంతో నిత్యం తనకు నరకం చూపిస్తూ వచ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నానని సందేహిస్తూ కొట్టేవాడని పేర్కొంది.
తాను నిద్రపోతున్న సమయంలో తనకు తెలీకుండా ఫింగర్‌ప్రింట్‌తో ఫోన్ లాక్ ఓపెన్ చేసి మెసేజ్‌లు, కాల్స్ లిస్ట్, ఫొటోలు చూసే వాడని.. వేరే అబ్బాయికి సంబంధించి ఏం ఉన్నా నిద్రపోతున్న తనను లేపి నిలదీసేవాడని చెప్పింది. అంతేకాకుండా తన ఫోన్ తీసుకుని అందులో రాత్రంతా అశ్లీల చిత్రాలు చూస్తూ గడిపేవాడని పేర్కొంది. ఇక అలెగ్జాండర్‌తో జీవించడం తన వల్ల కాదని జడ్జికి తెలిపింది. ఆమె వాదనలు విన్న జడ్జి అలెగ్జాండర్‌కు ఎటువంటి శిక్షను వేయలేదు. జీవితంలో మారడానికి ఇదొక అవకాశమని, చెడు అలవాట్లు మానుకుని మంచిగా మారాలని జడ్జి తెలిపారు. స్టాసీని మళ్లీ కలిసినా, ఇబ్బంది పెట్టినా కఠిన శిక్ష వేస్తానంటూ హెచ్చరించారు. అలెగ్జాండర్ మాత్రం తాను అసలు ఏరోజూ స్టాసీపై చేయిచేసుకోలేదని కోర్టుకు చెప్పాడు. స్టాసీ కాకపోతే లక్ష మంది అమ్మాయిలు దొరుకుతారని, స్టాసీని తమ వద్దే పెట్టుకోండంటూ తలతిక్కగా సమాధానం ఇవ్వడం గమనార్హం.