telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో 20 కోట్లు దాటినా వ్యాక్సినేషన్…

corona vaccine covid-19

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఆ వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యి 130 రోజులు ఆయింది. 130 రోజుల వ్వ‌వ‌ధిలో 20 కోట్ల‌మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు. 15,69,99,310 మందికి మొద‌టి డోసు వ్యాక్సిన్ అందించ‌గా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో ఎక్క‌వ మందికి వ్యాక్సిన్ అందించాల‌ని కేంద్రం సూచించింది. అయితే చూడాలి మరి ఈ వ్యాక్సినేషన్ ఎప్పటికి పూర్తవుతుంది మన దేశంలో అనేది.

Related posts