telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ బడ్జెట్ పై .. మాజీ ఆర్థిక మంత్రి కామెంట్… అనుకూలంగానే..

Arun Jaitely counter terrists attacks

ఆర్ధిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ పై సానుకూలంగా స్పందించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ బడ్జెట్ లో మౌలిక రంగానికి ప్రాధాన్యతనివ్వడం, నిజంగా సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు మార్గం, జాతీయ రహదారుల నిర్మాణాలు గతంతో పోలిస్తే చాలా వేగంగా కొనసాగుతున్నాయని అభిప్రాయ పడ్డారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా భారీగా పెరుగు తుందన్నారు.

రైల్వేశాఖకు కూడా అత్యంత ప్రాముఖ్యత కల్పించారన్నారు. రైల్వే స్టేషన్లను విమానశ్రయాల తరహాలో ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. నౌకాశ్రయాలు, విమానయాన రంగాలను కూడా దృష్టిలోకి తీసుకున్నారన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఉపాది కల్పన, పెట్టుబడులు ఊపందుకోనున్నాయని అభిప్రాయపడ్డారు. గహ రుణాలపై వడ్డీ రాయితీలను పెంచడం ద్వారా మధ్య తరగతి వారికి మద్దతుగా నిలిచారన్నారు. స్టార్టప్‌లకు, విద్యుత్‌ వాహనాలు, ఆటోమొబైల్‌ రంగానికి బడ్జెట్‌లో ప్రాముఖ్యత కల్పించారని పేర్కొన్నారు.

Related posts