telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు .. 3నే జీతాలు.. పండగనాడు మోడిచేయి..

AP

ఏపీ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల విషయంలో నిరాశకు గురిచేసింది. పండగ అయిపోయాక జీతాలు తీసున్నట్టు అంటే, వచ్చే నెల మూడో తేదీ వరకు వేతనాల కోసం ఎదురుచూడక తప్పదు. సంక్షేమ పథకాల పింఛన్లు అందుకుంటున్న వారికి కూడా అదే రోజున డబ్బులు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను ఒకటో తేదీనే ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది.

ఒకటో తేదీ ఆదివారం, రెండో తేదీ అయిన సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో బ్యాంకులకు సెలవు. దీంతో మూడో తేదీన వేతనాలు బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Related posts