telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మినీ మేడారం జాతర తేదీలు ప్రకటించిన పూజారులు…….

medaram jatara

ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పూజారులు. మండామేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2 సంవత్సరాల ఒకసారి జరిగే జాతర మేడారం సమ్మక్క సరాలమ్మ జాతర. పూజరుల సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మండమేలిగే పండగ సందర్భంగా సమ్మక్క, సరాలమ్మ పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24 బుధవారం గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఇదేరోజు ఉదయం గ్రామ నిర్భంధన జరుగనుంది.
25 గురువారం సమ్మక్క, సారాలమ్మ లకు పసుపు, కుంకుమ ల తో అర్చన జరుగనుండగా … 26 శుక్రవారం భక్తులు అమ్మవార్లను భక్తులు దర్శించుకోనున్నారు. 27 శనివారం అమ్మవార్ల పూజ కార్యక్రమాలు ముగింపుతో మినీ జాతర ముగుస్తుంది. మినీ మేడారం మండమేలిగే పండుగ సందర్భంగా అమ్మవార్ల గద్దెపై కి రారని ప్రధాన పూజారి పేర్కొన్నారు.

Related posts