telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-పాక్ మధ్య టీ20 సిరీస్…?

భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగితే.. ఆ సిరీస్‌లో టీమిండియా విజయం సాధిస్తే అభిమానులకు వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేం. కానీ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో ఓ సిరీస్‌లో తలపడబోతున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2021 సెకండాఫ్‌లో రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరిగే అవకాశాలున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాదిలో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు సదరు ఛానెల్ తమ కథనంలో తెలిపింది. ఓ పీసీబీ అధికారి దాన్ని స్పష్టం చేశాడని పేర్కొంది. అయితే చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లగా. ఈ ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిసారిగా తలపడ్డాయి. అయితే పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డ్‌ ఉంది.

Related posts