telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శివరాత్రి జాగారం ఎందుకు చేస్తారు.. ఎలా చేయాలి?

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తే సుఖ శాంతులు కలుగుతాయని హిందూ ధర్మం చెప్తోంది. శివరాత్రి మొత్తం శివ నామాలతో… ఓం నమ : శివాయ అనే పంచాక్షరీ మహమంత్ర స్మరణతో జాగరణ చేస్తే.. మీలో ఉన్న అనంత శక్తిని జాగృతం చేస్తుందట. శివ రాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించుకొని..ప్రసాదం తీసుకోని ఉపవాస వ్రతం ముగించాలి. శివ రాత్రి మరుసటి రోజు వరకు నిద్ర పోకుండా ఉంటేనే పుణ్యఫలం.

శివరాత్రి జాగారం ఎందుకు చేస్తారు?

పురాణాల ప్రకారం శివుడు గరలం మింగి..లోకాన్ని కాపాడిన మహా బహుళ చతుర్థశి నాడు మహా శివరాత్రి జరుపుకుంటారు. అమృతం కోసం దేవదానవులు క్షిరసాగర మథనం చేసారు. అమృతం కంటే ముందు హాలహలం వచ్చింది. లోకాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని కంఠంలో బందించి గరల కంటుడయ్యాడు. వెంటనే నీలకంటుడు మూర్ఛ పోయాడు. శంకరుడు మేలుకునే వరకు దేవతలు జాగారం చేసారు. అందుకే శివరాత్రి రోజున జాగారం చేస్తారు.

Related posts