telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గుంటూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ…

tdp ycp

ఏపీలో నిన్న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి ప్రశాంతంగా జరగ్గా ఎన్నికలు ముగిసే సమయంలో అనూహ్యంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  గుంటూరులోని 42 వ డివిజన్ లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.  వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్థిపై దాడి చేశారని చెప్పి మాజీ ఎంపీ మోదుగుల కారును ధ్వంసం చేశారు.  దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి.  మాజీ ఎంపీ పోలీస్ బూత్ లోకి వెళ్లి బ్యాలెట్ బాక్సులు పగలగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే, టీడీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని, దాని గురించి ప్రశ్నించేందుకు వెళ్లగా తమపై దాడి చేశారని, కారుపై దాడిచేసి ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.  పోటాపోటీగా ఇరు వర్గాలు నినాదాలు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.  ఈ దాడిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. చుడాలిమరి ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారు పోలీసులు అనేది.

Related posts