ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఛార్మి… ప్రస్తుతం నిర్మాతగా మారింది. సినిమాల్లో నటించడం మానుకున్నాక డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆమె.. ఈ బ్యానర్ బాధ్యతలు పూర్తిగా మోస్తూ పలు సినిమాలు రూపొందిస్తోంది. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ సక్సెస్ సాధించి లాభాలు గడించింది. కెరీర్ పరంగా విజయాలందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. అయితే ఛార్మి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో ఛార్మి కూడా సమీప బంధువును పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మూడు పదుల వయసు దాటినా.. ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తని ఛార్మి ఇలా సడెన్ గా పెళ్ళికి ఓకే అనడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో పెళ్ళిపై తనకు నమ్మకం లేదని, తనాకెలాంటి తోడు అవసరం లేదని ఛార్మి చెప్పిన సంగతి తెలిసిందే.
previous post