telugu navyamedia
సినిమా వార్తలు

దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ తేజ హీరోగా… తేజ రియాక్షన్ ఇదీ…!

Teja

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు హీరోగా మారిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో దాసరి నారాయణరావు, భీమినేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, కోడి రామక‌ృష్ణ, పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు నటుడిగా మారి తన సత్తా ఏమిటో వెండితెరపై చూపించారు. అయితే ప్రస్తుత రోజుల్లో వి.వి.వినాయక్ అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా వెండితెరపై తమ నట విశ్వరూపం చూపించడానికి రెడీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో డైరెక్టర్ తేజ హీరో గా మారడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దిల్ రాజు ఇటీవల ఒక కథ విన్నాడని, ఆ సినిమాలో తేజ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు వెంటనే ఆ స్క్రిప్టు మొత్తం డైరెక్టర్ తేజ కి వినిపించారని, దీంతో వెంటనే డైరెక్టర్ తేజ స్క్రిప్ట్ చాలా బాగుందని మొత్తం ఫైనలైజ్ చేయగా కచ్చితంగా సినిమా చేస్తానని క్యారెక్టర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉందని దిల్ రాజు కి చెప్పాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తేజ స్పందించారు. తాను నటుడిగా మారనని, జీవితంలో అసలు నటించనని, తనకు నటించడం చేతకాదని ఆయన పేర్కొన్నారు. `సీత` సినిమా తర్వాత తేజ తదుపరి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు.

Related posts