సినీనటుడు శివాజీకి హైకోర్టులో ఊరట లభించింది. అతనిపై జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించింది. శివాజీ మూడు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 25న ఆయన అమెరికా వెళ్తుండగా దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో శివాజీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన పిటీషన్ దాఖలు చేశారు. శివాజీ పిటిషన్‌పై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు శివాజీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.