telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎంతమందితో పడుకున్నావ్ అన్నాడు సల్మాన్… వివేక్ ఒబెరాయ్

Vivek-Oberoi

బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ బద్ధ శత్రువులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ కోసం వీరిద్దరూ కొట్టుకున్న సంగతి మీడియా ముందుకు రావడంతో వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన 2003 ఏప్రిల్ 1న జరిగినప్పటికీ అప్పట్లో వివేక్ పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 2003 మార్చి 30న వివేక్‌కు సల్మాన్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కానీ సల్మాన్ అందరి ముందు ఐశ్వర్య రాయ్‌ని కొట్టి అవమానించడంతో ఐష్… వివేక్ ఒబెరాయ్‌ని ప్రేమించారు. ఈ విషయం సల్మాన్‌కు తెలిసి వివేక్‌ను హెచ్చరించాలనుకున్నాడు. ఫుల్లుగా తాగి వివేక్‌కు ఫోన్ చేసి దారుణంగా తిట్టాడు. దీంతో ఆ మరుసటి రోజు ఉదయాన్నే తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టాడు. సల్మాన్ తనకు ఫోన్ చేసి బెదిరించిన విషయాన్ని మీడియా ముందు బయటపెట్టాడు. “సల్మాన్ నాకు ఎందుకు ఫోన్ చేశాడో అర్థం కాలేదు. నాతో చాలా దారుణంగా మాట్లాడాడు. సల్మాన్ చాలా చెడ్డవాడు. మర్యాదలేని మనిషి. సల్మాన్‌కి నాకు పోలికేంటి? నేను అతనిలా కాదు. ఆడవాళ్లను గౌరవిస్తాను. సల్మాన్ ఫోన్ చేసి నీచమైన ప్రశ్నలు అడిగాడు. ఎంతమందితో డేటింగ్‌లో ఉన్నావ్, ఎంతమందితో పడుకున్నావ్ అని అడిగాడు. ఐశ్వర్య రాయ్‌, దియా మీర్జా, రాణీ ముఖర్జీతో నాకు సంబంధం అంటకట్టాడు. నాకు అందరితో లైంగిక సంబంధాలు ఉన్నాయని అన్నాడు. నేను రోజుకో అమ్మాయిని వేసుకుని తిరుగుతూ ఉంటానని నాపై నిందలు వేశాడు” అని చెప్పాడు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పట్లో బాలీవుడ్‌లో సంచలనం రేపింది. నటీనటుల మధ్య ఏదన్నా జరిగితే వారిలో వారే పరిష్కరించుకోవాల్సిందిపోయి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం ఏంటని చాలా మంది వివేక్‌ను తిట్టిపోశారు. ఎందుకంటే సల్మాన్‌ను అనే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. అనవసరంగా మీడియా ముందుకు వచ్చి వివేక్ అన్నీ బయటపెట్టడంతో ఐశ్వర్య అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఈ ఘటన జరిగి ఇన్నేళ్లు అవున్నప్పటికీ వివేక్, సల్మాన్‌ మధ్య శత్రుత్వం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఎన్నోసార్లు తాను చేసిన పనికి వివేక్ సల్మాన్‌ను క్షమించమని అడిగాడు. కానీ సల్మాన్ కనికరించలేదు. అంతేకాదు వివేక్ నటించిన మోదీ బయోపిక్‌ విడుదల వాయిదా పడినప్పుడు తనకు సల్మాన్ సాయం కావాలని కోరాడు. “నీలో క్షమించే గుణం ఉందా సల్మాన్?” అంటూ పాత రోజుల్ని గుర్తు చేశాడు. అయినా సల్మాన్ ఇవేమీ పట్టించుకోలేదు.

Related posts