telugu navyamedia
సినిమా వార్తలు

సెభాష్ భీమ్ల నాయక్ .. టైటిల్ సాంగ్ అదుర్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

Break time in Bheemla Nayak Style: Pawan Kalyan and Rana Daggubati film on 12th January - tollywood

ఇందులో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్‏గా నటిస్తోండ‌గా.. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‎ సినిమాపై అంచనాలను పూర్తిగా పెంచడమే కాకుండా.. సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టైటిల్ సాంగ్… భీమ్లా నాయక్ పేరుతో సాగింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్… పోలీస్ డ్రెస్ లో చాలా పవర్ ఆఫీసర్ గా కనిపిస్తారు.

First look of Pawan Kalyan-Rana Daggubati starrer Bheemla Nayak out- Cinema express

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన సాంగ్ అదిరిపోయింది. భీం భీం భీం భీం భీమ్లానాయక్.. బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్.. భీం భీం భీం భీం భీమ్లానాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’’.. సెభాష్ భీమ్ల నాయక్ అంటూ వచ్చే సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ టైటిల్ సాంగ్ తో భీమ్లా నాయక్ సినిమా మరింత అంచనాలు పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 

Related posts