నవ్వితే అందరికీ ఆరోగ్యం అంటారు. అయితే.. నవ్వడంతో పాటు ఏడవడం వల్ల కూడా అనే లాభాలు ఉన్నాయట. ఓ పరిశోధన ప్రకారం… అప్పుడప్పుడు ఏడవడం అనేది కూడా ఆరోగ్యాకి మేలు చేస్తుందని తెలిసింది. అబ్బాయిలు ఏడుస్తుంటే అమ్మాయిలా ఏడుస్తావేంట్రా అని ఆటపట్టిసారు. అదే అమ్మాయిలు ఏడుస్తుంటే ఇక మొదలు పెట్టావా తల్లీ అంటూ జోక్స్ వేస్తారు. కానీ ఏడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ సమయం ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. వీటి వల్ల నొప్పిని తట్టుకునే సామర్థ్యం వస్తుంది.
ఏడవడం వల్ల మెదడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త సంతులితం అవుతుంది. దీనివల్ల సంయమనంతో ఆలోచిస్తాం.
కన్నీళ్లు రాల్చడం ద్వారా కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
చెడు ఆలోచనలను దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతత కల్పించి పాజిటివ్ ఆలోచనలనకు శ్రీకారం చుడుతుంది.
దీనిని బట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం నవ్వడంతో పాటు ఏడవడం కూడా మనిషి జీవితంలో కీలక ఘట్టమే.
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా