telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీటీడీ కీలక నిర్ణయం : త్వరలో మెట్లమార్గం రీ ఓపెన్.

తిరుమల శ్రీవారి భక్తలకు టీటీడీ పాల‌క మండ‌లి శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్య భక్తలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

దీని నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చినట్టు తెలిపింది.

టీటీడీకి విరాళంగా ఇచ్చిన 10 ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ‌ మంత్రి ఆదిత్య థాక్రే అందజేశారు.  దాని విలువ రూ. 500 కోట్లుగా ఉంటుంద‌ని తెలిపారు.

Maharashtra allots 10-acres land to build Tirupati Temple in Mumbai

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీలోని అన్నివిభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు.

దాదాపు రెండేళ్ల త‌రువాత అధిక సంఖ్య‌లో వచ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం స‌ర్వ దర్శనం, టైం స్లాటెడ్ దర్శనాలు కొనసాగిస్తామ‌న్నారు. న‌డ‌క దారి భ‌క్తుల‌కు త్వ‌ర‌లో టోకెన్లు జారీని ప్రారంభిస్తామ‌న్నారు.

అలాగే గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న శ్రీ‌వారి మెట్టు మార్గాన్ని పునఃరుద్ధ‌రించి శ్రీవారి మెట్టు మార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నడక మార్గంలో వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

Tirumala: TTD Governing Body Key Decisions - Sakshi

శ్రీవారి ఆలయంలోని రెండు బంగారు సింహాసలను 3.61 కోట్లతో నూతనంగా తయారు చేస్తామని ఆయన తెలిపారు.

అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో రూ.21.20 కోట్లతో ఇ మ‌రియు ఎఫ్ బ్లాకుల నిర్మాణానికి నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు.

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే…

*శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం
*శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి.
*విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి
*రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు
*తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు
*బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం
*తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉంటే 737 కాటేజీలు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం
*ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం
*టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం
*సీఎం తిరుపతి పర్యటన, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్న సీఎం
*శ్రీనివాససేతు ప్రారంభం
*బర్డ్‌ ఆసుపత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు
*తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం

Related posts