telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నాపై దాడి చేసింది టీడీపీ నేతలే: ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోప‌ణ‌లు

వైసీపీ నేత హత్యతో ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్ధితులు నెల‌కొన్నాయి.

గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఉదయం జి.కొత్తపల్లికి వెళ్లారు. వైసీపీ నేత హత్యలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కొందరు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై కార్యకర్తలంతా మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా ఎమ్మెల్యేను స్థానికులు నిర్భందించారు.

అయితే తనపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “జి.కొత్తపల్లిలో వైసీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఆ గ్రామంలో టీడీపీ వాళ్లు పోటీ చేయరు. పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీ వాళ్లే రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశారు.

అయితే గంజి ప్రసాద్, బజారియా వర్గాల మధ్య ఎప్పటి నుంచో మనస్పర్థలు ఉన్నాయి. ఇవాళ ఉదయం గంజి ప్రసాద్ హత్య గురించి తెలిసి జి.కొత్తపల్లి వెళ్లాను. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాను.

అయితే అక్కడికి కొత్త వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడి చేయబోయారని వివరించారు. తనపై దాడి చేసేందుకు వచ్చిన వారిని పార్టీలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. శవ రాజకీయాలు చేయడం వారికి అలవాటని తలారి వెంకట్రావు పేర్కొన్నారు.

జి.కొత్తపల్లిలో రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలు కూడా నాకు సపోర్ట్ గా ఉంటాయి. రెండు వర్గాలను సమన్వయం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టి నా పై దాడి చేయించారు అని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.

Related posts