టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నిన్న తన నియోజకవర్గం హిందూపురంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకొని, బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన పై బాలకృష్ణ స్పందించారు. తాను నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది? అని ఆయన ప్రశ్నించారు. చట్టంపై తమకు గౌరవం ఉందని తెలిపారు.
రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ స్థానికులతో కలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంటూ, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత నెలకొంది.