telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఆడకపోవడం నా అదృష్టం అంటున్న ఆసీస్ ఆటగాడు…

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత విమాన సర్వీసులపై నిషేధం విధించింది. దాంతో ఆందోళనకు గురైన ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆడమ్ జంపా, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్ లీగ్ నుంచి తప్పుకున్నారు. దీనిపై తాజాగా స్పందించిన​ లబుషేన్​.. తాను ఈ సీజన్​లో ఆడకపోవడమే తన అదృష్టమని చెప్పాడు. ‘ఈ గడ్డు పరిస్థితుల్లో ఐపీఎల్​లో లేకపోవడం ఓ వరంగా భావిస్తున్నాను. నేను ఈ మెగాలీగ్​ను ఎంతో ప్రేమిస్తాను. ఇందులో భాగస్వామ్యం ఎంతో గొప్పగా అనుకుంటున్నాను. ఓ నాణానికి రెండు వైపులు ఉంటాయి. నేను ఈ లీగ్​లో ఉన్నా ఆటకు దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే భారత్​లో పరిస్థితులు సరిగ్గాలేవు” ​అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్​ బయోబబుల్​ను సురక్షితంగా భావించనందునే తమ దేశ ఆటగాళ్లు తిరిగి వచ్చేస్తున్నారని అన్నాడు లబుషేన్​. ఈ విషయాన్ని వారే తనతో స్వయంగా చెప్పారని వెల్లడించాడు. అలాగే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనవుతున్నారు. కానీ నేను అందరితో మాట్లాడలేదు. ఏది ఏమైనా వారంతా లీగ్‌ను ముగించుకొని సౌకర్యవంతగా ఇంటి చేరాలని కోరుకుంటున్నా’అని లబుషేన్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో చెన్నై వేదికగా జరిగిన మినీ వేలంలో లబుషేన్‌ను కొనుగోలు చేయడంపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కోటీ రూపాయల కనీస ధరకు అతను అందుబాటులో ఉన్నా.. టెస్ట్ ప్లేయర్ అనే కారణంతో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

Related posts