telugu navyamedia
వార్తలు

వచ్చే నెలలో మోదీ పుట్టిన రోజు..‘సేవా సప్తాహ్’ కార్యక్రమాలు

modi on jammu and kashmir rule

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న 70వ పుట్టిన రోజు జరుపుకొనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 14 నుంచి 20 వరకు ‘సేవా సప్తాహ్’ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించేదీ తెలియజేస్తూ ఓ సర్క్యులర్‌ను రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు పంపించింది.

‘70’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమాల వివరాలను అందులో పొందుపరిచింది. సేవా సప్తాహ్‌లో భాగంగా ప్రతి మండలంలోనూ 70 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తారు. అలాగే, 70 మంది అంధులకు కళ్లజోళ్లు, 70 ఆసుపత్రులు, పేదల కాలనీల్లో పండ్లు పంపిణీ చేస్తారు. 70 మంది కొవిడ్ రోగులకు ప్లాస్మా దానానికి ఏర్పాట్లు చేయనున్నారు.

Related posts