telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా మందు రాకపోతే…?

Corona Virus Vaccine

ఆ దేశం.. ఈదేశం.. అని లేదు.. అంతకంతకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. యూరప్ దేశాల్లో అయితే, సెకండ్ వేవ్ కూడా మొదలుకావడంతో రెండో దశ లాక్‌డౌన్ వైపు మళ్లుతున్నాయి. మనదేశంలో మరణాల సంఖ్య తగ్గడంతో.. ప్రజలు వాడుతున్న మందులు సక్సెస్ అవుతున్నాయనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కరోనా వ్యాధికి మొదట్లో మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగించే హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను ఉపయోగించారు. అది ఎక్కువగా మనదేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దీంతో, వీటిని అమెరికా సహా చాలా దేశాలకు ఇండియానే భారీ స్థాయిలో ఎగుమతి చేసింది. ఇప్పటికీ కరోనా పేషంట్లకు చేసే వైద్యంలో దీన్ని  తగిన మోతాదులో వాడుతూనే ఉన్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ప్లాస్మా థెరఫీ.. ఇలా కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వైద్యులు. అయితే, మొదట్లో రెమిడిసివీర్ యాంటీ వైరల్ ఇంజెక్షన్లను కరోనాకు వాడొచ్చని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇప్పుడు మాట మార్చేసింది.  గత కొంతకాలంగా, వైరస్‌కు ఇదిగో మందు, అదిగో మందు అంటూ ప్రచారం జరగడమే తప్ప… కచ్చితంగా నయం చేస్తుందని చెప్పదగిన మెడిసిన్‌ ఉన్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైరస్ ఎంత ప్రమాదకారో… దాన్ని అదుపుచేయగల మెడిసిన్స్ కనుక్కోవడమూ అంతే కష్టం. ఇతర రోగాలకు ఉపయోగించే మందులను కరోనాపై ప్రయోగించి.. నయమవుతుందని భావిస్తున్నారు. రెమిడిసివిర్ కూడా ఆ కోవకు చెందినవే. కరోనాకు వాడే యాంటీ వైరల్ డ్రగ్స్‌ కేవలం ఉపశమనం మాత్రమేనని.. పూర్తి స్థాయి మందు కాదని నిపుణులు మొదట్నుంచీ చెబుతూనే ఉన్నారు. కరోనా దేశంలో విజృంభిస్తున్న తరుణంలో రెమిడిసివర్‌కు అత్యవసరంగా అనుమతులు ఇచ్చింది ఐసీఎంఆర్. అది శరీరంలోని వైరల్‌ లోడ్‌ను తగ్గిస్తాయని రుజువైంది.

Related posts