telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్‌ పౌరుల హక్కులను కాలరాస్తున్నారు: బైడెన్

Biden USA

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ… తమ దేశ ఆర్మీని ట్రంప్‌ తన వ్యక్తిగత కక్ష్య సాధింపులకు వాడుకుంటున్నారని ఆన్నరు. ట్రంప్ పౌరుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

తాను అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక సైన్యాన్ని ఆయనలా వినియోగించుకోబోనని బైడెన్ తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ఇతర పౌరులను ట్రంప్‌ ఉసిగొల్పారంటూ ఆయన ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక వైట్‌ హౌస్‌ను నుంచి వెళ్లిపోవడానికి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ నిరాకరిస్తే సైన్యమే ఆయనను అక్కడి నుంచి పంపుతుందని బైడెన్ అన్నారు.

Related posts