telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దేత్తడి హారిక పై టూరిజం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కామెంట్స్…

మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌ తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా దేత్తడి హారికనునియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దేత్తడి హారికను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం టూరిజం మంత్రికి కూడా తెలీయదని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ఎక్సైజ్‌, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు. దేత్తడి హారిక నియామకం పట్ల సీఎం కార్యాలయానికి గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. అసలు ఆ హారిక ఎవరో కూడా తనకు తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, నిహారిక వివాదంపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సానియా మీర్జా లాంటి వ్యక్తులను నియమించినప్పుడు వీళ్లంతా ఏమైయ్యారు అంటూ విమర్శిస్తున్నారు.

Related posts