telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సీనియర్ నటి .. గీతాంజలి మృతి..

senior actress geetanjali died

టాలీవుడ్ లో సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి.. మొదట హిందీలో పేయింగ్ గెస్ట్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. శ్రీశ్రీ మర్యాదరామన్న, సీతారామకళ్యాణం, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, తోడ నీడ, లేత మనసులు, దేవత, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢాచారి 116వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి.. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మిలోనూ నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. ఇక వీరి కుమారుడు ‘భూమ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. 1961లో తొలిసారిగా ఎన్టీఆర్ సీతారాముల కల్యాణం సినిమాలో సీత పాత్రలో నటించారు గీతాంజలి. నందినగర్ లోని నివాసానికి గీతాంజలి భౌతికకాయాన్ని తరలించారు. గీతాంజలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Related posts