telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడి చక్రవర్తికి అవార్డు

మన చిత్రాలు, మన నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. దేశవిదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన హీరో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. జేడీ చక్రవర్తి హీరోగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన అవార్డు లభించింది.

ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. దీంతో జేడీ చక్రవర్తి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది వరకు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజీవ్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. సునితా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది.

Related posts