telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

యువనేతను కలిసిన కోడుమూరు ప్రజలు (3-5-2023):
• కర్నూలు – అదోని రోడ్డులో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డును విస్తరించాలి.
• రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేయాలి.
• రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటుచేసి మురుగు సమస్యను నివారించాలి.
• పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.
• స్థానిక సంస్థలకు చెందిన రూ.8,660 కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించింది.
• మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేవు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• కోడుమూలో స్థానికులకు ఇబ్బంది లేకుండా రోడ్ల విస్తరణ, డివైడర్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తాం.

Related posts