telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబునాయుడు…రాజకీయ ప్రస్థానం

chandrababu speech on 12 hrs diksha

నిత్య కృషీవలుడు, కాలంతో పోటీ పడే తెలుగు సూరీడు, ఆధునిక సాంకేతికా వినియోగంలో యువతకు పోటీ అతడు..విలువలెరిగిన నాయకుడు,పరిణతి చెందిన రాజ నీతిజ్ఞుడు దార్శనికుడు,భావితరాల బంగారు భవిష్యత్తుకు బాట వేసిన మహనీయుడు.. ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు ఇండియా టుడే నుండి “ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం”, ద ఎకనమిక్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”, టైమ్స్ ఆసియా నుండి “సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్”, ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
ముఖ్యమంత్రి (1995–2004)
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును కలిసారు. అమెరికన్ మ్యాగజైన్ “టైమ్” కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, “కేవలం ఐదు సంవత్సరాలలో, చంద్రబాబు గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు.” అని తెలిపాడు. ఆ పత్రిక చంద్రబాబు ని “సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్” గా అభివర్ణించింది.

  • చంద్రబాబు విజయాలు :
    28వ యేట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్నవయసు గల సభ్యుడు, మంత్రి.
    తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత.
    రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు.
    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.
    ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటుంగులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ ద మిలీనియం గా ఎంపిక.
    టైం మ్యాగజైన్ ద్వారా “సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్” గా గుర్తింపు.
    ఎకనమిక్స్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్” గా గుర్తింపు.
    “సి.ఇ.ఒ. ఆఫ్ ఆంధ్రప్రదేశ్” గా ఆయనను పిలుస్తారు.
    2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి. స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి “ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం”.
    మే 2017లో “ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు”.
  • జాతీయ రాజకీయాలపై ప్రభావం :
    1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’ గా చంద్రబాబు మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు.
    1999 ఎన్నికల విజయం
    1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి. అధ్వర్యలోని ఎన్.డి.ఎ. సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య “నీరు-మీరు” కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
  • 2014 ఎన్నికలలో విజయం
    చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2014 జూన్‌ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
    ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 33 వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం.
  • సూర్యోదయ రాష్ట్రం
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, నవ్యాంధ్ర కు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ – ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను “ఏ.పి. క్లౌడ్ ఇనిషియేటివ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.
  • అమరావతి శంకుస్థాపన
    2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.
    కాగా 2019 లో ఓటమి కారణంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం.. ప్రతిపక్ష హోదా లో ఉన్నారు.
    ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆంధ్ర రాష్ట్రాభివృద్ది కి అనుక్షణం శ్రమించిన నిత్య కృషీవలుడు అభివృద్ధి & సంక్షేమాలకు అసలైన నిర్వచనం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్య మంత్రి వర్యులు గౌరవ “నారాచంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు…

Related posts