telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్వచ్చమైన చిరునవ్వుతో జీవించు…..

స్వచ్చమైన చిరునవ్వుతో జీవించు…..
స్వేచ్చా విహంగమై విహరించు…..
నవ్వుకు మిత్రుడు
కష్టాలకు ఆప్తుడు
కన్నీటిని తరిమి
కొట్టిన స్నేహితుడు
పేదరికాన్ని పంటి బిగువున
నొక్కిపట్టి ముని పంటిపై
చిరునవ్వునద్దిన
చిరకాల సాత్వికుడు
అతి పిన్నవయస్సులోనే
చరిత్రలో నిలిచాన మేధావి
అల్లరి వయస్సులో అమ్మ పరువును
నిలబెట్టిన వీర పుత్రుడు
మట్టి వాసన మరువక
బీదరికం బిక్కు బిక్కుమని
వెక్కిరించినా… కలత చెందక
కాంతులీనిన కావ్యపురుషుడు
అవమానించిన చోటే ఆస్కార్ అవార్డు
అందుకున్న అనుభవజ్ఞుడు
ప్రపంచాన్ని చుట్టిన మారాజు
జీవితాన్ని దగ్గరగా చూసి
లోతైన బావాల్ని అలవోకగా
నేర్పిన స్నేహశీలి చాప్లిన్
నవ్వు యొక్క గొప్పతనాన్ని
తనలో ఇముడ్చుకుని
ప్రపంచానికి తెలియజెప్పిన
అఖండ విజేయుడు చార్లి
మృత్యువును కూ నవ్వుతూ
స్వీకరించిన చరిత్ర పురుషుడు

Related posts