మన నిత్య జీవితంలో మనకు కొబ్బరి కనిపిస్తుంది. దీంతో హిందువులకు విడదీయరాని బంధం ఉంది. దేవుడికి నైవేద్యంగా సమరపించే ఏ కొబ్బరిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు, కుడుక, కొబ్బరి నూనె అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో నీరసాన్ని తగ్గించి, ఇమ్యూనిటీ పెంచడంలో కొబ్బరి ఉపయోగపడుతుంది. ఇతర వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు అవేంటో చూద్దాం
ఇమ్యూనిటీ పెంచుతుంది :
కరోనా తో పాటు ఏ ఇతర వ్యాధి నుంచి అయినా రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ రోగ నిరోధక శక్తిని పెంపోందించడంతో కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు తాగడం లేదా కొబ్బరి ముక్కలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో కరోనా తో పాటు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవారికీ కొబ్బరి ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరిలో కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర విడుదలను అపుతుంది. అలాగే ఈ కొబ్బరి.. జుట్టుకు నూనె రూపంలో పోషకాలను అందిస్తుంది. అందుకే దీనిని హెయిర్ ఆయిల్ గా వాడుతారు.
టీపీసీసీ పదవిపై నాకు ఆసక్తి లేదు: వెంకటరెడ్డి