telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రిపబ్లిక్ డే సందర్బంగా ”వైల్డ్ డాగ్” విడుదల…

wild-dog

నాగార్జునకు చాలా రోజులుగా సరైన హిట్ లేదు. గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ తో వచ్చిన కింగ్ నాగార్జున అభిమానులను నిరాశపరిచాడు. అయితే ప్రస్తుతం నాగ్ అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు . అందాల భామలు దియా మీర్జా – సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమై ఈ మద్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే లాక్ డౌన్ లో బంద్ అయిన థియేటర్లు మళ్ళీ ఈ డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సినిమాతో తెరుచుకున్నాయి. దాంతో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుంది. అయితే ‘వైల్డ్ డాగ్’ ను మాత్రం నేరుగా ఓటీటీ లోనే విడుదల చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అందుకోసం ఓ డేట్ కూడా ఫిక్స్ చేసారు. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా నాగార్జున ఎదురుచూస్తున్న ఆ హిట్ ను అందిస్తుందా… లేదా అనేది చూడాలి మరి.

Related posts