దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.76 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 323144 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2771 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెకండ్ వేవ్ కరోనా తన ప్రతాపం చూపిస్తున్నా ఇప్పటి వరకు మరణాల రేటు 1 శాతం మాత్రమే ఉందని.. 99 శాతం మంది కరోనా నుంచి కొలుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో మరణాల రేటు 1.12 హతం ఉంటే, 98.88 శాతం మంది నుంచి రికవరీ అవుతున్నారని, వారిలో ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉంది వైద్యం తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్ వేవ్ ప్రారంభంలో 37 శాతం మందికి వెన్టిలేషన్ అవసరం కాగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
previous post
వాళ్ళను చూసి ఆడవాళ్లు చెడిపోతున్నారు : శ్రీరెడ్డి