telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒంటిపై నూలు పోగు లేకుండా… పోలీసులను పరుగులు పెట్టించిన హంతకుడు

Crime

వర్జీనియాలోని పిట్సిల్వేనియా కౌంటీలో ఉండే 19 ఏళ్ల మాథ్యూ బెర్నార్డ్ అనే యువకుడు మంగళవారం అతి కిరాతకంగా తల్లి, సోదరి, మేన కోడలితో పాటు పెంపుడు కుక్కను ఇంట్లోనే చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు 911 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం బెర్నార్డ్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో మీడియా కూడా అక్కడికి వెళ్లడం… ఈ సంఘటనను వీడియో తీయడం జరిగింది. ఇక పోలీసులు రావడం గమనించిన అతడు ఒంటిపై నూలు పోగు లేకుండా బయటకు పరుగు అందుకున్నాడు. అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన పోలీసుల వైపు కూడా పరిగెత్తాడు. ఆ తరువాత ఓ వాహనం వద్ద నిలబడిన వ్యక్తిని అడ్డం పెట్టుకొని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేయడం వీడియోలో రికార్డైంది. దీంతో పోలీసులు అతడ్ని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బెర్నార్డ్ ప్రయత్నించడం… చివరకు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తరువాత అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వార్తల్లో రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

Related posts