telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉత్తర ప్రదేశ్ లో లాక్ డౌన్…

దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. రోజుకు 10 వేలకు పైగా కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.  మహారాష్ట్ర తరువాత నార్త్ ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.  మధ్యప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను మే 7 వ వరకు పొడిగించారు.  ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో లాక్ డౌన్ విధించారు.  రేపు సాయంత్రం నుంచి మే 4 వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  కరోనా మహమ్మారి వ్యాప్తిపై  అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  అయితే చూడాలి మరి ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటాయి అనేది.

Related posts