telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌లపై ఏపీ విద్యాశాఖ‌ ఫోక‌స్…

exam hall

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌కారం ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసి.. ఆ దిశ‌గా ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా.. ఇప్పుడు ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా ఫోక‌స్ పెట్టింది విద్యాశాఖ‌.. మే నెల మొత్తం సెలవులు ప్రకటించినా.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్జేడీలకు ఇప్ప‌టికే ఆదేశాలు వెళ్లాయి… సెలవుల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు డిజిటల్ మార్గాల ద్వారా సహకరించాల్సిందిగా టీచర్లను ఆదేశించారు అధికారులు.. పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్ధులకు ఆన్ లైన్ మార్గాల ద్వారా సందేహాలు తీర్చాల్సిందిగా సూచించారు.. ఇక‌, జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పాఠశాలలకు తిరిగి రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ‌.. పరీక్షల నిర్వహణ, పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సూచిచింది. చూడాలి మరి ఈ పరీక్షలు ఎలా జరుగుతాయి అనేది.

Related posts