రాజధాని రైతులకు సంఘీభావంగా ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రవాసాంధ్రులు అమరావతి ఉద్యమానికి రూ.7,76,022 విరాళం ఇచ్చారని తెలిపారు. రాజధాని రైతులు, మహిళలకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకురావడం సంతోషమన్నారు.
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పెట్టుబడులు రావట్లేదని పేర్కొన్నారు. వైసీపీ ఆడుతున్న మూడు ముక్కలాట రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి..కొత్త పెట్టుబడులు రావడం లేదు. ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్లు అయింది. అభివృద్ధిని రివర్స్ చేశారని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.