telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌ న్యూస్‌ : తగ్గిన బంగారం ధరలు

గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగాయి. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే… తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 53, 610 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 49, 150 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో రూ. 51, 380 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో రూ.47, 100 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 400 తగ్గడంతో రూ. 66, 300కు చేరింది.

Related posts