telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వారి పై ఆగ్రహం వ్యక్తం చేసిన స‌ల్మాన్ ఖాన్…

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ దక్షిణ కొరియా యాక్షన్ చిత్రం ‘ది అవుట్‌లాస్’కు హిందీ రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిషా పటానితో పాటు జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా నటించారు. ఈద్ కానుక‌గా వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్ `రాథే` సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైర‌సీ చేయ‌డంపై హీరో, నిర్మాత స‌ల్మాన్ ఖాన్ మండిప‌డుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజ‌న‌బుల్ గా రూ. 249 రూపాయ‌ల‌కే త‌మ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామ‌ని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ త‌మ చిత్రాన్ని కాపీ చేసి సోష‌ల్ మీడియాలో అందుబాటులో ఉంచ‌డం దారుణ‌మ‌ని స‌ల్మాన్ ఖాన్ వాపోతున్నాడు. ఇలాంటి వారిని ఎవ‌రూ ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని చెబుతూనే, ఈ ర‌కంగా పైర‌సీ చేసే వారు సైబ‌ర్ సెల్ తీసుకునే చ‌ర్య‌ల‌తో ఇబ్బందుల పాల‌వుతార‌ని హెచ్చ‌రించాడు.

Related posts