telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముక్కలవుతున్న .. కర్ణాటక కాంగ్రెస్..

twists in karnataka congress

కాంగ్రెస్ పార్టీలోని వ్యతిరేక వర్గం సిద్దరామయ్య మీద మరోసారి విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిద్దరామయ్య వర్గం ఉండాలి, లేదా మేము ఉండాలి అంటూ కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం హైకమాండ్ కు పరోక్షంగా హెచ్చరించింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ముందు సిద్దరామయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని కాపాడే బుద్దిని ప్రసాదించు దేవుడా అనే ఫ్లక్సీలు ఏర్పాటు చేసి మాజీ సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్దరామయ్య వర్గమే కారణం అని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నది.

కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప, బీకే. హరిప్రసాద్ తదితరులు మాజీ సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా మౌనంగా ధర్నా నిర్వహించారు. కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడి పదవిని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు లేదా హెచ్.కే. పాటిల్ కు ఇవ్వాలని హైకమాండ్ కు మనవి చేశారు. అయితే కొందరు నాయకులు మాజీ సీఎం సిద్దరామయ్యకు ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మనవి చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ బెంగళూరు చేరుకుని యార్డిసన్ హోటల్ లో బస చేశారు. మధుసూదన్ మిస్త్రీని సిద్దరామయ్య వర్గీయులు, ఆయన వ్యతిరేక వర్గీయులు భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల నాయకులు మధుసూదన్ మిస్త్రీని కలిసి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Related posts