telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్నేహలత మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు…

ఏపీ అనంతపురంకి చెందిన స్నేహలత మర్డర్ కేసులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం నగరంలోని అశోక్ నగర్ కు చెందిన స్నేహలత. డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ పరిస్థితుల దృష్యా మధ్యలోనే ఆపేసింది. కాని హాకీ క్రీడలో మాత్రం.. మంచి పేరు తెచ్చుకుంది. అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీలో హాకీ నేర్చుకుంది. హాకీ ఆటలో ప్రతిభ కనబర్చి, ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రెండు వారాలకు ముందు ధర్మవరం స్టేట్ బ్యాంక్ లో పొరుగు సేవల ఉద్యోగంలో చేరింది.  రోజు లాగా అమ్మ నాన్న వెళ్లొస్తా అంటూ చేతిలో టిఫిన్ బాక్స్, హ్యాండ్ బాగ్ పట్టుకుని వెళ్లింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకుంది. 6.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్‌ చేసి ఒక గంటలో ఇంటికి చేరుకుంటానని చెప్పింది. అయితే రాత్రి 7.30 గంటలైనా కూతురు ఇంటికి చేరలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు స్నేహలతకు ఫోన్‌ చేశారు. స్విచ్ఛాఫ్‌ అని రావడంతో.. గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న రాజేష్‌ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని ఇంటికి వెళ్లి ‘మా కుమార్తెను ఏం చేశావ్‌. ఎక్కడుందో చెప్పు అంటూ నిలదీశారు. ఆ సమయంలో అతనితో పాటు స్నేహితుడు కార్తీక్‌ కూడా అక్కడే ఉన్నాడు. తనకు తెలియదని సమాధానం చెప్పడంతో చివరికి రాత్రి 9.30 గంటల సమయంలో అనంతపురం ఒకటో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం.. ధర్మవరం సమీపంలోని బడన్నపల్లి పొలం వద్ద ఓ యువతి మృతదేహం సగం కాలి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. మృతురాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మవరం బ్రాంచిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి స్నేహలత అని ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు. తమ కూతురు కనిపించడంలేదని అంతకు ముందురోజు రాత్రే, అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని స్నేహలత తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహలతను వేధిస్తున్నాడంటూ రాజేష్‌పై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, వారి నిర్లక్ష్యమే తమ కుమార్తె ప్రాణం తీసిందని తల్లి ఆరోపించారు.

అయితే ఈ ఘటన వెనుక ఏం జరిగిందనేది జిల్లా ఎస్పీ వివరించారు. ఇంతకీ ఎవరీ ఈ రాజేష్ కార్తీక్. స్నేహలత ఉంటున్న అశోక్ నగర్ లోనే రాజేష్ కార్తీక్ లు ఉంటున్నారు. పోలీసుల కథనం మేరకు ఏం జరిగిందంటే.. రాజేష్ గత 4 సంవత్సరాల నుంచి అంటే స్నేహ లత మైనర్ గా ఉన్నప్పటి నుంచీ గుత్తి రాజేష్ ప్రేమ పేరుతో వెంట పడేవాడు. అంతే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికే వాడు. ఈక్రమంలో ఆమెను మోసగించి పలు మార్లు శారీరక వాంఛ తీర్చుకునే వాడు. ఇదిలా ఉండగా అమ్మాయి ఎస్బీఐలో ఉద్యోగంలో చేరాక ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. నవంబర్ నెల ఆఖరు నుండి దూరంగా ఉన్నారు. డిశంబర్ 22 న అమ్మాయి ఫోన్ చేసి తనను ధర్మవరం నుండి అనంతపురంనకు ఎక్కించుకెళ్లాలని చెప్పింది. తెగిపోయిన ఈ సంబంధం మళ్లీ ఇలా కలిసింది. గుత్తి రాజేష్ మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్లి పికప్ చేసుకున్నాడు. బడన్నపల్లి వద్ద రోడ్డుపై ఆపి మాట్లాడాలని ఆ అమ్మాయిని పొలాల్లోకి తీసికెళ్లాడు. పాత పరిచయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మళ్లీ శారీరకంగా కలిశాడు. ఆ తర్వాత నిందితుడికి ఆమెపై ఉన్న అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. మాట మాట పెరిగి ఆమెను గొంతు నులిమి చంపి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఆమె చున్నీ, కాగితాలతో పొట్ట భాగంపై కాల్చాడు. గుత్తి రాజేష్ స్నేహితుడైన సాకే కార్తీక్ ప్రోద్భలం కూడా ఇందులో ఉంది. గుత్తి రాజేష్ ను ఇతను ప్రేరేపించాడు. ధర్మవరం నుండి స్నేహలతను నేర స్థలం వరకు ఎక్కించుకొచ్చిన అపాచీ వాహనాన్ని, ప్రధాన నిందితుడు వినియోగించిన 3 సెల్ ఫోన్లు మరియు మరో ఫోన్ కలిపి 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. అయితే ఘటన జరిగిన 24గంటల లోపే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకురాలైన అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుండి మోసగించి శారీరకంగా కలసినందుకు ఫోక్సో చట్టం కింద 4 & 6, మరియు 376 IPC సెక్షన్లు యాడ్ చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.  ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి త్వరితగతిన దర్యాప్తు పూర్తీ చేసి నిందితులకు శిక్ష పడేటట్లు చేస్తామని ఎస్పీ తెలిపారు.

Related posts