దేశంలో ఇప్పటి వరకు 5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,393కు చేరిందని ఆయన తెలిపారు. రెండు వారాలుగా 78 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. గడిచిన 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. 30 రోజుల లాక్‌డౌన్‌ను ప్రజలు స్ఫూర్తివంతంగా పాటించారని కేంద్రం తెలిపింది.
కేసుల సంఖ్య రెట్టింపు కాకూడదనేది తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా నోడల్ అధికారుల నియామకం చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ నుంచి కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రికల్ దుకాణాలకు, పుస్తక విక్రయాలకు, రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ యూనిట్లకు మొబైల్ రీఛార్జ్ పాయింట్లకు మినహాయింపు ఇచ్చారు.
ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ