కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ముంచింది మీరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె రాయ్‌బరేలీలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించని వారి పేర్లను కనుక్కుంటామన్నారు. ఎవరెవరు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారో వారి హృదయాలకే తెలుసన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు అమిత్ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింఘ్వీ డిమాండ్ చేశారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె అన్నారు.
ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలొచ్చారు: కన్నా