telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

పెరిగిన విజయడైరీ పాల ధరలు

vijaya milk pocket

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ విజయా డైరీ పాల ధరలు మరోసారి పెరిగాయి. పాడి రైతుల నుంచి పాలసేకరణ ధరలు పెరిగిన నేపథ్యంలో పాల సరఫరా ధరలను కూడా పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్) నిర్ణయించింది. ఈ మేరకు లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలు పెంచింది. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని టీఎస్‌డీడీసీఎఫ్ వెల్లడించింది.

పెరిగిన పాల ధరల నేపథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు, బేస్ మార్జిన్‌ను లీటరుకు రూ.3.25 పైసలు పెంచినట్టు టీఎస్‌డీడీసీఎఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. విజయ డెయిరీ నుంచి నిత్యం 2.20 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టాండర్డ్ (వెన్నశాతం 4.5 శాతం) పాలు, హోల్ (వెన్న 6 శాతం) పాల ధరల్లో ఎలాంటి మార్పుచేయలేదని పేర్కొన్నది.

Related posts