telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నీరవ్ మోదీ పై.. 5వేలపేజిల .. సాక్ష్యాలు ఇచ్చిన భారత్…

nirav modi in Landon caught by media

ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నీరవ్ మోదీ లండన్ లోని వాండ్స్ వార్త్ జైల్లో ఉన్నాడు. నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించే క్రమంలో అక్కడి కోర్టులో అప్పీల్ చేసిన కేంద్ర ప్రభుత్వం అతడికి వ్యతిరేకంగా 5000 పేజీలతో సాక్ష్యాధారాలు సమర్పించింది. తన క్లయింటు ఈ పేజీలన్నింటిని పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలకు తగినవిధంగా స్పందించాలంటే ఓ ల్యాప్ టాప్ అవసరమని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్ కోర్టుకు విన్నవించారు.

తన క్లయింట్ తో స్వల్ప సమయంలో ఇన్ని పేజీలపై చర్చించాలంటే చాలాకష్టం.. అని జోన్స్ వాదించారు. ఆ ల్యాప్ టాప్ కు ఇంటర్నెట్ సదుపాయం అక్కర్లేదని, ఆ 5000 పేజీల సమాచారాన్ని అందులోకి లోడ్ చేస్తే సరిపోతుందని జెస్సికా జోన్స్ చెప్పారు. దానితో ఆయన నీరవ్ మోదీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తూ అతనికి సహకరించాల్సిందిగా జైలు వర్గాలను ఆదేశించారు.

Related posts