తనతో కలిసి మద్యం సేవించలేదని స్నేహితుడిపై బీరుసీసాతో దాడికి పాల్పడిన ఘటన ఘటన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మచిలీపట్నం ప్రాంతానికి చెందిన ఎం.దినేష్(18) గతంలో పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఓ గొడవ కేసులో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన దినేష్ ప్రతీ వారం పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి సంతకం చేస్తుంటాడు.
యథావిధిగా సోమవారం రైల్లో నగరానికి వచ్చిన దినేష్ ..స్నేహితుడు గణేశ్‌తో కలిసి పీఎస్‌కు వచ్చి సంతకం చేశాడు. అనంతరం పాత స్నేహితుడు నవీన్‌ను కలుద్దామంటూ గణేశ్ చెప్పగా.. ఇద్దరు కలిసి శ్రీరాంనగర్‌కు వచ్చారు. అక్కడ స్నేహితుడు నవీన్‌తో పాటు మరో స్నేహితుడు సాయితో కలిసి హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మద్యం తాగుతున్నారు.
అయితే దినేష్ తనకు తాగడం ఇష్టం లేదని నిరాకరించాడు. ఎన్నిసార్లు చెప్పి నా దినేష్ మద్యం తాగకపోవడంతో ఆగ్రహానికి గురైన నవీన్ దుర్భాషలాడాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్.. తనవద్ద ఉన్న బీర్‌బాటిల్‌ను పగలగొట్టి దినేష్‌పై దాడికి దిగాడు. ఈ దాడిలో దినేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదు: యనమల