telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భూమ్మీద 8వ కొత్త ఖండం… ఎక్కడుందంటే… !?

Adria

భూమ్మీద మహాసముద్రాలు అయిదు, ఖండాలు ఏడు.. అంటూ ఎప్పుడో అయిదో తరగతిలో చదువుకున్న లెక్కలు మారబోతున్నాయి. ఈ విషయాన్ని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెల్లడించారు. ఈ ఖండానికి ‘గ్రేటర్ ఆడ్రియా’ అని పేరు పెట్టారు. ప్రస్తుత గ్రీన్‌ల్యాండ్ అంత ఉన్న ఈ ప్రాంతం 14 కోట్ల ఏళ్ల కిందట అమెరికా ఖండం నుంచి విడిపోయిందని తేల్చారు. మధ్యధరా ప్రాంతంలో పరిశోధనలు చేస్తుండగా ఇది తమ కళ్లబడిందని చెప్పారు. భూపొరల్లో జరిగిన మార్పుల వల్ల ఈ ప్రాంతం భూఅంతర్భాగంలో కలిసిపోయిందని, ఐరోపా ఖండం కిందకు వెళ్లిపోయిందని వివరించారు. ఈ భూభాగం ఆడ్రియాటిక్ సముద్రం నుంచి ఇటలీ వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.

Related posts