ఈ ఏడేళ్ళలో ఎన్నికోట్ల నకిలీ విత్తనాలు అమ్మారు.. రైతులు ఎంతమేర నష్టపోయారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు కిసాన్ మోర్చా ఇన్చార్జ్ ప్రేమేంధర్ రెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఎన్ని పీడీ యాక్ట్ పెట్టారు.. రైతుబందు పేరుతో రైతులకు వచ్చే అనేక సబ్సిడీలను తెలంగాణ సర్కార్ కోత పెట్టిందన్నారు. డీఏపీ కేంద్ర ప్రభుత్వం సగం ధరకే ఇస్తుందనన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తా అన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటరా? లేదా..? రైతులకు అరచేతిలో స్వర్గం చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు పేరుతో మిల్లర్లు, కొనుగోలు దారులు వందల కోట్ల రైతుల సొమ్ము తింటున్నారని.. ధాన్యంలో 4-5 కిలోలు తగ్గించారన్నారు. కేంద్ర ప్రభుత్వం 1890 రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు కట్ చేస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ రైతులకు కేంద్రం 2 వేల కోట్ల రూపాయలపైన సాయం చేస్తోందని.. ప్రభుత్వ తీరు మారకపోతే భవిష్యత్ లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 22 న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని అన్నారు.
previous post
next post
గ్రామ వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రజని