telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బ్రెజిల్ లో మరో కొత్త వైరస్…

corona mask

చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే బ్రెజిల్ లో రోజుకు వేలాది కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఇప్పటికే బ్రెజిల్ లో కరోనా వైరస్ మ్యూటేషన్ కారణంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.  మరణాల సంఖ్య పెరగడానికి బ్రెజిల్ మ్యూటేషన్ కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇప్పుడు ఇదీ చాలదు అన్నట్టు మరో కొత్త మ్యూటేషన్ కనిపించింది.  దక్షిణాఫ్రికా రకం వైరస్ ను సావోపాలో లో ఓ వ్యక్తి శరీరంలో గుర్తించారు.  అయితే, వైరస్ సోకిన వ్యక్తి దక్షిణాఫ్రికా ప్రయాణం చేయలేదు.  అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులతో ఎలాంటి కాంటాక్ట్ లేదు.  కానీ, ఆ వ్యక్తిలో దక్షిణాఫ్రికా రకం వైరస్ ను గుర్తించడంతో బ్రెజిల్ లోని వైరస్ ఉత్పరివర్తనం చెంది దక్షిణాఫ్రికా రకం వైరస్ గా మార్పు చెంది ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయో తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే చూడాలి మరి ఈ వైరస్ ప్రభావం ఎలా ఉండనుంది అనేది.

Related posts