telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూ.ఎన్టీఆర్ కి .. ఆర్.ఆర్.ఆర్ యూనిట్ … తాయిలం ..

tarak first look from rrr on his birthday

గత కొద్దికాలంగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయన, మరొక స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ జన్మదినం కావడంతో ఇప్పటికే నందమూరి అభిమానులు పెద్దఎత్తున ఆ రోజున వేడుకలు చేయడానికి సన్నద్ధమయ్యారు.

టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదట. దానికి ప్రధాన కారణం, గత ఏడాది అయన తండ్రి హరికృష్ణ గారు ఆగష్టులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు, మా కుటుంబం ఇంకా ఆ విషాదం నుండి బయటకు రాలేదు, కావున జన్మదిన వేడుకలకు నేను దూరంగా ఉన్నాను అని ఎన్టీఆర్ అన్నట్లు సమాచారం. తారక్ పుట్టిన రోజున ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఆయన లుక్ ఒకటి రిలీజ్ కానుందని మరొక వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ విషయాన్ని ఆ టీమ్ కూడా గోప్యంగా ఉంచిందట. ఇక అయన పుట్టిన రోజున ఆ లుక్ పోస్టర్ ను ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇవ్వనుందట.

ఓవైపు ఎన్టీఆర్ తన జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం అయన ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే విషయం అయినప్పటికీ, ఒకవేళ ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఏదైనా సర్ప్రైజ్ పోస్టర్ విడుదలైతే మాత్రం పండుగే అని చెప్పుకోవాలి. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఆ చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువదలేదు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు..!

Related posts