పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని ఒకపక్క చెప్తూనే, ఇప్పుడు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన బీజేపీ, ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తిరుపతి సాక్షిగా అప్పట్లో బీజేపీ హామీ ఇచ్చిందని, హామీని నెరవేర్చకుండా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందని శైలజానాథ్ విమర్శించారు. పాచిపోయిన లడ్డూలు ఎవరికీ కావాలి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ విమర్శలు చేశారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.
previous post