telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కేరళలో కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు పరీక్షలు రద్దు

vijayan kerala cm

కేరళ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా వైరస్‌) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధృవీకరించారు. బాధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 12 కు చేరింది.

దీంతో, సీఎం పినరయి విజయన్‌ కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు.. ఏడో తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మిగితా క్లాసుల వారికి షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయని సీఎం వివరించారు. ట్యూషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, అంగన్వాడీలు, మదర్సాలు కూడా మార్చి 31 వరకు మూతపడనున్నాయి.

Related posts