telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రిటైర్డ్ ఉద్యోగులకు .. ఉద్వాసన.. లేకుంటే ఆయా అధికారులకు తిప్పలే..

ap map

ఏపీ ప్రభుత్వం వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31కు ముందున్న వారి సేవలు అవసరం లేదని తేల్చింది. అదే విధంగా 40 వేల వేతనం మించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందినీ తపపించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీడీపీ హాయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా..పేపర్ నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారిని సైతం తొలిగించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఇంత కీలక నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనికి అనేక కారణాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ముందుగా వారిని తొలిగిస్తే..ప్రభుత్వం ఏం చేయబోయేది విరిస్తున్నారు.

గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారం నియామకాలు జరిగాయనే కారణంతనే వారిని తప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ కార్యదర్శి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న అధికారుల్లో ఎవరైనా ఇప్పటికీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందున్న సీటులోనే ఇప్పటికీ ఉంటే… వారి సబ్జెక్టు మార్చడం,..లేదా హెడ్‌ క్వార్టర్స్‌లోనే మరో ఆఫీసుకు పంపడం చేయాలని ప్రభుత్వం సూచించింది. మూల వేతనం రూ.56,780 కంటే ఎక్కువ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని వివరించారు. వీరిని ఈ నెలాఖరులోగా తొలిగించటం ద్వారా వాస్తవంగా అవసరమైన పోస్టులు ఎన్ని..భర్తీ చేయాల్సినవి ఎన్నీ అనే లెక్క మీద స్పష్టత రానుంది. దీని ద్వారా జనవరిలో చేపట్టాలని నిర్ణయించిన ఉద్యోగాల భర్తీలో వీటిని కొత్త వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం

Related posts